Épisodes

  • తెలుగు భాషా దినోత్సవం EP5: తెలుగుబడి కదంబ కార్యక్రమం
    Aug 29 2024
    గత నాలుగు వారాలుగా తెలుగు భాషా ఔనిత్యాన్ని, ప్రాశస్త్యాన్ని, భాషలోని సొగసుని, సొబగులని, సాహితీ పరిమళాలని తెలుసుకుంటూ వస్తున్నాం.
    Voir plus Voir moins
    22 min
  • తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..
    Aug 22 2024
    ఏ భాషకైనా తలమాణికాలు సామెతలు, జాతీయాలు. భాషకు సొబగులు అద్ది, భావ ప్రకటనకు దోహదపడేవే సామెతలు. సరళ సుందరమైన భాష, భావావేశం, లయ సామెతలకు పెట్టని అలంకారాలు. అక్షరజ్ఞానం ఉన్నవాడైన, లేనివాడైనా మాటల్లో చమత్కారాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఒలకబోస్తాడు. ఆ చమత్కారంలో ఆనందం, ఉపదేశం రెండూ ఇమిడి ఉంటాయి. ‘వాక్యం రసాత్మకమ్ కావ్య’ మయితే రసాత్మకమైన వాక్యమే సామెత.
    Voir plus Voir moins
    13 min
  • తెలుగు భాషా దినోత్సవం EP3: తెలుగు సాహిత్యంలో జాతీయత.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు...
    Aug 15 2024
    సమాజంలోని మార్పులకు అనుగుణంగా కవులు స్పందించటం పరిపాటి. నాడు ఆంగ్లేయుల దాస్య శృంఖలాలు నుంచి విముక్తి పొందటానికి చేసిన పోరాటంలో అనేకమంది తెలుగువారు ప్రాణాలు అర్పించారు. తెలుగు కవులు కూడా తమ వంతుగా స్వాతంత్రోద్యమ భావనను రగిలించే రచనలు చేసి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించారు.
    Voir plus Voir moins
    17 min
  • తెలుగు భాషా దినోత్సవం EP2: తెలుగు సాహిత్యానికి తలమానికం శతక సాహిత్యం
    Aug 8 2024
    శాఖోపశాఖాలుగా విస్తరించిన తెలుగు సాహితీ విపణిలో శతకపద్య ప్రక్రియ ఒకటి. 12వ శతాబ్ధంలో మొదలైన శతక సాహిత్య పరిమళాలు నేటి ఆధునిక కాలంలో కూడా గుభాళిస్తున్నాయి.
    Voir plus Voir moins
    15 min
  • తెలుగు భాషా దినోత్సవం EP1: తెలుగు భాషా ప్రశస్తి
    Jul 31 2024
    ‘భాష’ అంటే భావాన్ని వ్యక్తం చేసేది. అలాంటి అమ్మభాషతో మనిషి బంధం ఉమ్మ నీటిలో ఉన్ననాటిది. అది మన పుట్టకతో మొదలవుతుంది. మనం గిట్టినా అనంత విశ్వంలో విహరిస్తూనే ఉంటుంది.
    Voir plus Voir moins
    9 min