ప్రపంచ ప్రఖ్యాత కథకుల్లో రష్యన్ రచయిత ఆంటొన్ చెహోవ్ మొదటి వరుసలో వుంటారన్నది నిర్వివాదాంశం. కథల్లో వస్తువుతోపాటు, ఒక విలక్షణ శైలితో రచనలు చేసారాయన. ఒకటొ, రెండో, మహా అయితే మూడో పాత్రలు మాత్రమే వుండే కథలతో ఆయన జీవితాన్ని గురించిన గాఢమైన నిజాలను ఆవిష్కరించారు.